తెలుగు · కవిత్వం

చాలా మాముల మనిషిని

Written by

Chinna Reddy

చాలా మాముల మనిషిని

చాలా మాముల మనిషిని

జననమరణాలకు అతితుడిని కానే కాదు

బాధ భయాలకు లోంగేవాడిని

సుఖసంతోషాలకు పొంగేవాడిని

చందమామను అందుకోలేదు

కాంతివేగం కనుకొలేదు

సముద్ర లోతుని చుడనులేదు

రాజ్యాలను ఏలను లేదు

అందుకే చాలా మామూలు మనిషిని

దాన గుణంలో కర్ణుడిని కాదు

ధర్మాన్ని ఆచరించే ధర్మరాజుని కాదు

కుచేలుడు అంత పేదొడిని కాదు

కృష్ణుడు అంత గొప్ప మిత్రుడిని కాదు

కుబేరుడు అంత ధనవంతుడిని కాదు

నిత్యం సత్యం పలికే హరిశ్చంద్రుడిని కాదు

విద్య అభ్యసించడంలో అర్జునుడిని కాదు

ఏకలవ్యుడు అంత గొప్ప శిష్యుడిని కాదు

చాలా మామూలు మనిషిని

చరిత్ర పుస్తకాలు చదివేవాడిని తప్ప

చరిత్రలో లేనివాడిని

అందుకే చాలా మామూలు మనిషిని

బంధ విముక్తిడిని కాదు

స్వార్ధానికి సాయానికి మధ్య సంఘర్షణలో బ్రతికే ఒక మధ్య తరగతి మనిషిని

చాలా మామూలు మనిషిని