తెలుగు · కవిత్వం

ఓ నేస్తమా

Written by

Chinna Reddy

ఓ నేస్తమా

ఓ నేస్తమా!

అందమైన ఆ కళ్లల్లో

కన్నీళ్లా ?

దేనికొరకు ? జీవిత కురుక్షేత్రంలో ఒంటరై ఓడుతున్నావా? 

భయానికి లొంగిపోయావా?

ప్రపంచానికి భయపడిపోయావా?

దాస్యత్వానికి బలియ్యావా?

ఓ నేస్తమా?

ఆనందాన్ని పంచే ఆ మాటలు

మౌనం వైపు దారి మళ్లాయా

దేనికొరకు? ప్రేమించలేదా?

ప్రేమించబడలేదా?

ప్రేయసి అందలేదా?

ప్రకృతి సహకరించలేదా?

కులాలు కుదరలేదు?

మతాలు కలవలేదా?

ఓ నేస్తమా?

దేనికొరకు ని ప్రశాంతతను

కోల్పోతున్నావు?

బంధాలు భారమా?

మరణ భయమా?

ఒంటరితనమా?

నమ్మకద్రోహమా?

ఓ నేస్తమా?

మరి దేనికొరకు? విచారిస్తున్నావు?

విజయ తీరాలు చేరలేదా?

ఓటమి నిన్ను విడవడం లేదా?

జీవితార్థం తెలియడం లేదా?

ఓ నేస్తమా!

నీ మనసు లోతుల్లో దాగిన భయానికి

లొంగిన నువ్వు

నీలో దాగిన వెలుగు స్వరూపాన్ని

గుర్తుంచా లేకపోయావా ? నన్ను

తెలుసుకోలేకపోయావా? నా కొరకై

ధ్యానం చేయలేకపోయావా ?

ఈ ఆత్మ స్వరూపన్న కనుగొనలేకపోయావా ?

ఓ నేస్తమా!

ఇక చాలించు నీ దుఃఖం

కనుగొను నీ మనసు లోతుల్లో దాగిన ఆనందం

మొదలుపెట్టు నా వైపు నీ గమ్యం

అదే ఆత్మ ప్రయాణం

ఓ నేస్తమా !

గెలుపు ఓటములు నిన్ను కదపలేవు

బాధ భయాలు నీ మనసు లోతుల్లోకి రాలేవు

ప్రేమ నీ వైపు ఆకర్షితమవుతుంది

ప్రకృతి నీలో ఏకమవుతుంది

బంధాలు బంధుత్వాలు అంత పరమాత్మ స్వరూపంతోనే

నిత్యం ఆనందం నీలో ప్రసరిస్తుంది

స్థితప్రజ్ఞుడై నిలుస్తావు

యుద్ధాలు గెలుస్తావు

మృత్యువును జయిస్తావు .

ఓ నేస్తమా ! నా ప్రియ నేస్తమా

సాగించు నీ జీవిత ప్రయాణం

తెలుసుకో అంతా నీలో ఉంది అనే వాస్తవం

కానీ ఏది నీది కాదు అనే నిజం

అందించు సాయం

తొలగించు అజ్ఞానం

ప్రేమించు ఈ సమస్తం

నవ్వుతూ అంగీకరించు

చివరి మజిలీ ఆ స్మశానం!