తెలుగు · కవిత్వం
మూగ ప్రేమ
Written by
Chinna Reddy

నా మదిలో ప్రేమ, నిండు నదిల చేరింది
నా ప్రేమ ఉత్తరానికి చిరునామా అయింది
నా ప్రేమ రాగాలకు సంగీతంలా మారింది
నా ప్రేమ పదాలకు భాషగా మారింది
నా ప్రేమ కళ్ళకు తానే రూపం అయింది
దేహమంతా ప్రేమతో నిండిపోయింది
నా లోని ప్రేమ భావాలు
తన మదిని అందుకోవాలని
ఉప్పెనలా పొంగింది
అప్పుడే తెలిసింది నా ప్రేమ మాటలు రాని ఒక మూగది అని
నా ప్రేమ ఒక అల అని, చెప్పడానికి ఎంత ఎగిసిన తిరిగి అక్కడే పడతానని
నా ప్రేమ నా మదిలో బంధింపడింది అని, విడిపించడానికి తాళాలు లేవు అని
నా ప్రేమ ఆకాశంలో నక్షత్రం అని, చూడగలమే గాని అందుకోలేమని
ప్రేమను మానలేను
అల అని ప్రేమను వ్యక్తిపర్చలేని
ఎందుకంటే నాది మూగ ప్రేమ
దారం తెగిన గాలిపటంలా ఆమె అదృశ్యమైంది
మనసు తీరాన్ని దాటి, ఆమె ప్రేమను అందుకోవాలని, నా ప్రేమ పయనం అయింది
కొండల్లో వెతికాను, కోనల్లో చూసాను
ముళ్ళల్లో నడిచాను, వర్షంలో తడిచాను
ఎండల్లో మండను, చలిలో వణికాను
గాలిపటం కనిపించలేదు
ఆమె కూడా కనిపించలేదు
దార్నిపోయే అనామకుడు చెప్పాడు
నింగి, నేల కలిసే చోట
నీ ప్రేమ ఉంది అని
పిచ్చి వాడిలాగ గంతులు వేస్తూ
ఆ చోటికి నా ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాను.